News August 30, 2025

తంగళ్ళపల్లి: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని మానేరు వాగులో గుర్తుతెలియని మగ మనిషి శవం లభ్యమైనట్టు ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మానేరు వాగు వద్ద కిషన్ అనే రైతు మృతదేహం ఉందని గ్రామ కార్యదర్శి ప్రశాంత్‌ సమాచారం ఇచ్చారన్నారు. కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం ఖననం చేశామన్నారు. మృతుడు సుమారు నెల రోజులు క్రితం చనిపోయినట్లుగా ఉందన్నారు.

Similar News

News September 1, 2025

నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. పెన్షన్ల పంపిణీ

image

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.

News September 1, 2025

టారిఫ్స్ లేకపోతే మన దేశం నాశనమయ్యేది: ట్రంప్

image

ట్రంప్ అధికార పరిధి దాటి టారిఫ్స్ విధిస్తున్నారంటూ <<17559172>>US కోర్టు<<>> ఇటీవల ఆక్షేపించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ‘టారిఫ్స్ వల్ల $ట్రిలియన్లు వచ్చాయి. అవి లేకుంటే మన దేశం పూర్తిగా నాశనమయ్యేది. మన మిలిటరీ పవర్ పోయేది. ఇది ర్యాడికల్ లెఫ్ట్ గ్రూప్ జడ్జిలకు తెలియదు. కానీ డెమోక్రాట్ ఒబామా నియమించిన ఒక్క జడ్జి మాత్రం దేశాన్ని కాపాడేందుకు ఓట్ వేశారు. అతడి ధైర్యానికి థాంక్స్’ అని వ్యాఖ్యానించారు.

News September 1, 2025

నంద్యాల: ‘ఆ గ్రామంలో 22 ఏళ్ల నుంచి గణేశ్ ఉత్సవాలు లేవు’

image

నంద్యాల(D) ప్యాపిలిలో 22 ఏళ్లుగా గణేశ్ ఉత్సవాలకు గ్రామస్థులు దూరంగా ఉంటున్నారు. 2003 SEP 2న గ్రామంలోని SC కాలనీలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగిస్తుండగా అగ్రకులాల వారు అడ్డుకున్నారు. పెద్దఎత్తున ఘర్షణ జరిగి ఇరువర్గాల వారు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 187 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. అప్పటి నుంచి మండపాలలో వినాయకుడిని ప్రతిష్ఠించకుండా ఇళ్లలోనే ఉత్సవాలు చేస్తున్నారు.