News August 30, 2025

ఆదోనిలో నిమజ్జనానికి భారీగా పోలీసు బందోబస్తు

image

ఆదోని పట్టణంలో ఆదివారం జరిగే వినాయక నిమజ్జనానికి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. శనివారం ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో DSP హేమలత ఆధ్వర్యంలో సూచనలు చేశారు. ఉదయం నిమజ్జనాన్ని త్వరగా ప్రారంభించి చీకటి పడేలోగా శోభయాత్ర ముగిసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. డీఎస్పీలు, సీఐలు పోలీసులు సుమారుగా 1000 మందికి పైగా బందోబస్తులో ఉంటారన్నారు.

Similar News

News September 3, 2025

రూ.కోటి విరాళం ప్ర‌క‌టించిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు విగ్ర‌హ నిర్మాణానికి టీజీవీ సంస్థ‌ల త‌రఫున‌ రూ.కోటి విరాళం ఇస్తున్న‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తిలో ఏపీ ప్ర‌భుత్వం, పొట్టి శ్రీరాములు మెమోరియ‌ల్ ట్ర‌స్ట్‌ సంయుక్తంగా 58 అడుగుల కాంస్య విగ్ర‌హంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం ఏర్పాటు చేయ‌నున్నాయి. వీటి నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం మంత్రి భ‌ర‌త్ ఈ విరాళం ప్ర‌క‌టించారు.

News September 3, 2025

గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రటిష్ఠ చర్యలు చేపట్టండి: ఎస్పీ

image

కర్నూలులో గురువారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనం సజావుగా జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కర్నూలు టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్‌తో కలిసి ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News September 3, 2025

ఉద్యోగం కోసమే తండ్రిని చంపాడా?

image

కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో తండ్రి రామాచారిని కుమారుడు వీరస్వామి చారి <<17598178>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. రామాచారి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం కోసం తండ్రిని కుమారుడు హతమార్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టారు.