News August 30, 2025
HairFall: దువ్వెన ‘ఛేంజ్ చూడండి!

అందంలో భాగమైన కురులపై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాలిపోతున్నాయా? షాంపూలు, కండిషనర్స్, ఆయిల్స్ మార్చి అలిసిన అమ్మాయిలు ఒక్కసారి దువ్వెన మార్చి చూడండి. రెగ్యులర్ ప్లాస్టిక్ కోంబ్ పక్కనబెట్టి చెక్క దువ్వెనను పట్టుకోండి. చెక్క అయితే తలకు తాకడం లేదని అంటారు. కానీ అలా బలంగా తాకితే స్కాల్ప్‌పై ఉండే నేచురల్ ఆయిల్ పోతుంది. చెక్క స్మూత్‌తో కుదుళ్లపై తక్కువ ఒత్తిడితో వెంట్రుకలు రాలడం, చిట్లడం తగ్గుతుంది.
Similar News
News September 1, 2025
దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ

AP: <<17398848>>నోటీసులతో<<>> సంబంధంలేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35లక్షల మందిలో 95% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.
News September 1, 2025
తుమ్మిడిహట్టి, మేడిగడ్డపైనే ప్రధాన చర్చ

TG: కాళేశ్వరాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంపైనే అసెంబ్లీలో ప్రధాన చర్చ జరిగింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెప్పినా BRS ప్రభుత్వం దోపిడీ చేసేందుకే దాన్ని మార్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. MH అభ్యంతరం కేవలం ఎత్తుపైనే అని తెలిపారు. మేడిగడ్డ వద్ద అదనంగా 120 TMCల లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ, CWC సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.
News September 1, 2025
ALERT: ఇవాళ భారీ వర్షాలు

బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో APలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులపాటు వానలు పడతాయంది. ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP, అనకాపల్లి, KKD, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అటు TGలో ఆసిఫాబాద్, MNCL, NRML, పెద్దపల్లి, భూపాలపల్లి, MLG, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.