News August 30, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ మహిళలతో కలిసి RTC బస్సులో ప్రయాణించని హోంమంత్రి
➤ బైలపూడిలో భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్
➤ జన్నవరంలో భూవివాదంలో తండ్రి కూతుర్లపై దాడి
➤ వసతి గృహాల విద్యార్థులకు దోమల తెరలు పంపిణీ
➤ దేవరాపల్లి ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
➤ కోర్టు కానిస్టేబుళ్లు, CMS సిబ్బందితో SP సమీక్ష
➤ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
➤ కలిగొట్లలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

Similar News

News September 1, 2025

మద్నూర్: వివాహేతర సంబంధమే భర్త హత్యకు కారణం.!

image

డోంగ్లి మండలం సిర్పూర్‌కు చెందిన రాములు అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ విఠల్ రెడ్డి వివరాలు.. రాములు భార్య మాదాభాయ్, శంకర్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రాములు అడ్డు తొలగించుకోవడానికి వీరిద్దరూ కలిసి అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు వెల్లడించారు. నిందితులు మాదాభాయ్, శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News September 1, 2025

NGKL: ప్రీ-ప్రైమరీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగానికి ఇంటర్మీడియట్, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హత కనీస అర్హతలుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.

News September 1, 2025

భువనగిరి: భూమికి పచ్చాని రంగేసినట్లు..

image

భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు ఆయకట్టులో వరి పొలాలు పచ్చని రంగుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపుగా పెరిగిన వరి చేలు చూడముచ్చటగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు. కనుచూపుమేరలో పచ్చని రంగేసినట్లు కనిపించే పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.