News August 30, 2025
KMR: జిల్లాలో దెబ్బతిన్న ఇండ్లకు సాయం

కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇండ్ల వివరాలను అధికారులు సర్వే ద్వారా సేకరిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 234 పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు, 1 పూర్తిగా కూలిపోయిన కచ్చా ఇంటికి ప్రభుత్వం సహాయనిధి మంజూరు చేసింది. మిగతా ఇండ్ల సర్వే పూర్తి చేసి, అర్హులైన వారికి కూడా త్వరలో సహాయం అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు.
Similar News
News September 1, 2025
మద్నూర్: వివాహేతర సంబంధమే భర్త హత్యకు కారణం.!

డోంగ్లి మండలం సిర్పూర్‌కు చెందిన రాములు అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ విఠల్ రెడ్డి వివరాలు.. రాములు భార్య మాదాభాయ్, శంకర్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రాములు అడ్డు తొలగించుకోవడానికి వీరిద్దరూ కలిసి అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు వెల్లడించారు. నిందితులు మాదాభాయ్, శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News September 1, 2025
NGKL: ప్రీ-ప్రైమరీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగానికి ఇంటర్మీడియట్, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హత కనీస అర్హతలుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.
News September 1, 2025
భువనగిరి: భూమికి పచ్చాని రంగేసినట్లు..

భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు ఆయకట్టులో వరి పొలాలు పచ్చని రంగుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపుగా పెరిగిన వరి చేలు చూడముచ్చటగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు. కనుచూపుమేరలో పచ్చని రంగేసినట్లు కనిపించే పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.