News August 30, 2025
న్యాయంపూడి జంక్షన్ వద్ద యాక్సిడెంట్

నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి హైవే జంక్షన్ వద్ద శనివారం రాత్రి కొబ్బరిలోడు ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రాక్టర్ బోల్తా పడి ఎస్.రాయవరానికి చెందిన కర్రి వెంకట సూరి (45) అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ కె.కుమారస్వామి చెప్పారు. మరో వ్యక్తి గాయపడగా ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.
Similar News
News September 1, 2025
ఎన్టీఆర్: బెంగళూరు వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా దానాపూర్(DNR)- SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం:03251 DNR- SMVB రైలును ప్రతి ఆది, సోమవారాలలో డిసెంబర్ 29 వరకు, నం:03252 SMVB- DNR రైలును ప్రతి మంగళ, బుధవారాలలో డిసెంబర్ 31 వరకు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాలలో విజయవాడతో పాటు వరంగల్, ఒంగోలు, గూడూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయన్నారు.
News September 1, 2025
మద్నూర్: వివాహేతర సంబంధమే భర్త హత్యకు కారణం.!

డోంగ్లి మండలం సిర్పూర్‌కు చెందిన రాములు అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ విఠల్ రెడ్డి వివరాలు.. రాములు భార్య మాదాభాయ్, శంకర్‌కు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రాములు అడ్డు తొలగించుకోవడానికి వీరిద్దరూ కలిసి అతన్ని హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు వెల్లడించారు. నిందితులు మాదాభాయ్, శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News September 1, 2025
NGKL: ప్రీ-ప్రైమరీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగానికి ఇంటర్మీడియట్, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హత కనీస అర్హతలుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.