News August 30, 2025

వాళ్లే T20 వరల్డ్ కప్‌ ఓపెనర్స్‌ అవుతారు: రైనా

image

T20 వరల్డ్ కప్-2026 ఓపెనర్లుగా ఎవరుంటే బాగుంటుందో ఓ పాడ్ కాస్ట్‌లో మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చెప్పారు. ‘ఓపెనర్స్‌లో ఒకరు యశస్వీ జైస్వాల్. రెండో వ్యక్తిగా ప్రియాన్ష్, అభిశేక్ శర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. నేను అభిశేక్‌ను ఎంచుకుంటాను. గిల్ కెప్టెన్‌గా, మూడో స్లాట్‌లో ఉండాలి’ అని తెలిపారు. గిల్, శాంసన్‌ని ఎంచుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News September 1, 2025

KCR, హరీశ్ పిటిషన్లు.. మధ్యంతర ఉత్తర్వులకు కోర్టు నిరాకరణ

image

TG: ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని, ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా, కేసును CBIకి అప్పగించకుండా ఆదేశించాలని కేసీఆర్, హరీశ్ తరఫు న్యాయవాదులు కోరారు. కానీ దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

News September 1, 2025

APPLY NOW: 750 బ్యాంకు ఉద్యోగాలు

image

పంజాబ్&సింధ్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. APలో 80, TGలో 50 ఉద్యోగాలున్నాయి. 20-30ఏళ్లు గలవారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఏదైనా పబ్లిక్ సెక్టార్/రూరల్ బ్యాంకులో 18 నెలల పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.48,480-రూ.85,920 ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://punjabandsind.bank.in/<<>>

News September 1, 2025

భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

image

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్‌తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు.
☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ
☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం
☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.