News August 31, 2025
పోర్న్ సైట్‌లో మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మార్ఫింగ్ ఫొటోలు పోర్న్ సైట్‌లో దర్శనమివ్వడం తీవ్ర దుమారం రేపింది. 7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆ సైట్‌లో మెలోనీతోపాటు పలువురు ప్రముఖుల ఫొటోలూ ఉన్నాయి. తనతోపాటు చాలామంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంపై మెలోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి చర్యలు చాలా అసహ్యకరం. బాధిత మహిళలందరికీ నా మద్దతు ఉంటుంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.
Similar News
News September 1, 2025
అంతర్గత కలహాలతోనే హరీశ్‌ను టార్గెట్ చేశారు: మహేశ్ కుమార్

TG: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టమైందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ‘తప్పు కేసీఆర్ చేశారా? హరీశ్ రావు చేశారా? అనేది అనవసరం. స్కామ్ జరిగిందని స్పష్టమైంది. మామా అల్లుళ్ల వాటా ఎంతో తేలాలి. కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కు చేరింది. కుటుంబ తగాదాలను కాంగ్రెస్‌పై రుద్దడమేంటి? అంతర్గత కలహాలతోనే హరీశ్ రావును టార్గెట్ చేశారు’ అని అన్నారు.
News September 1, 2025
ప్రభాస్‌తో సినిమా కోసం అనుష్క వెయిటింగ్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మరో సినిమా చేయాలని హీరోయిన్ అనుష్క శెట్టి భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత అదే రేంజ్‌లో ఉండే కథ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కచ్చితంగా డార్లింగ్‌తో మళ్లీ కలిసి నటించే రోజు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అనుష్క నటించిన ‘ఘాటీ’ మూవీ ఈ నెల 5న థియేటర్లలో విడుదల కానుంది.
News September 1, 2025
కవితపై చర్యలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్?

TG: పార్టీ అగ్రనేతలపై సంచలన <<17582704>>ఆరోపణలు<<>> చేసిన MLC కవితపై BRS చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె PRO పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో కవిత కామెంట్స్‌ను పోస్ట్ చేశారు. దీంతో వాటిని డిలీట్ చేసిన బీఆర్ఎస్.. PROను అందులో నుంచి తొలగించింది. అటు BRS ఫాలోవర్లు కవిత X, ఇన్‌స్టా అకౌంట్లను అన్‌ఫాలో కొడుతున్నారు. కవిత విషయంలో అధినేత KCR ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కేడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.