News August 31, 2025

KNR: వరద కాలువలో గల్లంతైన రహీం మృతదేహం లభ్యం

image

కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిన రహీం మృతదేహం లభ్యమైనట్లు శనివారం కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అబ్దుల్ రహీం(20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.

Similar News

News September 1, 2025

కరీంనగర్: ‘సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి’

image

కరీంనగర్‌లో ఎల్‌ఎండీకి సందర్శకుల తాకిడి పెరిగింది. నీటి మట్టం పెరగడంతో పాటు ఆదివారం కావడం వల్ల సాయంత్రం పెద్ద సంఖ్యలో కట్టపై నుంచి రిజర్వాయర్ లోకి వెళ్లారు. ప్రమాదకరంగా నీటిలోకి వెళ్ళి గడిపారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చేరుకుని సందర్శకులను అక్కడి నుండి పంపించేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

News August 31, 2025

కరీంనగర్‌కి గర్వకారణం.. జాతీయ అవార్డు పొందిన రామకృష్ణ, సునీత

image

ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో నేడు AP లోని నర్సరావుపేటలో తెలుగు భాష దినోత్సవం సందర్బంగా తెలుగు భాష, సంస్కృతి, వైభవం, సాహిత్యం తదితరాల్లో విశేష సేవలను అందిస్తున్నందుకు గాను తెలుగు తేజం పురస్కార అందిస్తుంది. ఇందులో భాగంగా SRR కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ, చిందం సునీత జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు.

News August 31, 2025

KNR: నిజాయితీకి చిరునామా.. ఆటో డ్రైవర్ రాజేందర్

image

కరీంనగర్‌లోని పొలంపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాజేందర్, గీతాభవన్ వద్ద ఓ ప్రయాణికుడు మరచిపోయిన బ్యాగును తిరిగి అందజేశాడు. ఆ బ్యాగులో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ప్రయాణికుడు దిగిన చోటికి వెళ్లి బ్యాగును సురక్షితంగా అప్పగించాడు. రాజేందర్ నిజాయితీని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.