News August 31, 2025

KNR: వచ్చే నెలలోనే స్థానిక పోరు.. అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం

image

స్థానిక ఎన్నికలను SEP 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించగా, సర్కారు వచ్చే నెలలో పూర్తి చేసేందుకు సిద్ధం చేసింది. రిజర్వేషన్ల సీలింగ్ ను ఎత్తివేసి, 42% రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్ తీర్మానించి ఎన్నికల నిర్వహణకు ECకి లేఖను కూడా పంపింది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు, ఓటర్ లిస్ట్ ఇలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

Similar News

News September 1, 2025

సీఎంకు భద్రాద్రి ఎమ్మెల్యేల వినతి

image

గిరిజన నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా గిరిజన శాసనసభ్యుల కోరికపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

News September 1, 2025

జగన్‌తో ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు

image

పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జడ్పీటీసీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అందరితో జగన్ చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చేయాల్సిన కార్యాచరణలపై చర్చించారు.

News September 1, 2025

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు <<17393463>>రద్దు<<>> చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.