News August 31, 2025

కరీంనగర్: స్థానిక పోరు ప్రచారానికి సమయం లేదు మిత్రమా..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు TG కేబినెట్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డినెన్సు ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి, SEP మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసి, నెలాఖరులోపు ఎన్నికల పూర్తికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆశావాహుల ఎన్నికల ప్రచారానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఇలా ఐతే ఖర్చు తగ్గుతుందని అభ్యర్థుల ఆశాభావం. ఉమ్మడి జిల్లాలో 1216 పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలున్నాయి.

Similar News

News September 1, 2025

సీఎంకు భద్రాద్రి ఎమ్మెల్యేల వినతి

image

గిరిజన నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా గిరిజన శాసనసభ్యుల కోరికపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

News September 1, 2025

జగన్‌తో ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు

image

పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జడ్పీటీసీలు, పలువురు ప్రముఖులు ఉన్నారు. అందరితో జగన్ చర్చించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో చేయాల్సిన కార్యాచరణలపై చర్చించారు.

News September 1, 2025

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

image

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు <<17393463>>రద్దు<<>> చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.