News August 31, 2025
ఈనాటి ముఖ్యాంశాలు

* ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది: కుప్పంలో సీఎం
* TG: రేపు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక
* బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పొన్నం
* యూరియా కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమం: హరీశ్‌రావు
* చైనాలో మోదీకి రెడ్ కార్పెట్ వెల్‌కమ్
* తెలంగాణ వరద బాధితులకు బాలకృష్ణ రూ.50 లక్షల సాయం
* అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం(94) కన్నుమూత
Similar News
News September 2, 2025
త్వరలో మణిపుర్‌లో పర్యటించనున్న మోదీ!

PM మోదీ ఈనెల రెండో వారంలో మణిపుర్‌లో పర్యటిస్తారని తెలుస్తోంది. వందలాది ప్రాణాలు పోతున్నా PM పట్టించుకోవట్లేదని విపక్షాలు విమర్శిస్తున్న వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని సమాచారం. 2023 మే 3న అక్కడి తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.
News September 2, 2025
ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్ల GST వసూళ్లు

కేంద్రం ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్ల GST కలెక్ట్ చేసింది. గతేడాది AUGతో పోల్చితే 6.5% పెరుగుదల నమోదైంది. అయితే జులై వసూళ్ల(రూ.1.96 లక్షల కోట్లు)తో చూస్తే తక్కువే. పెద్ద రాష్ట్రాల్లో రూ.28,900 కోట్ల కలెక్షన్స్‌తో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. గ్రోత్ రేట్ పరంగా సిక్కిమ్(39%) ముందుంది. ఓవరాల్‌గా ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్ల ట్యాక్స్ వసూలైన విషయం తెలిసిందే.
News September 2, 2025
మీకు కన్నడ వచ్చా: రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం

కర్ణాటక పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘మీకు కన్నడ వచ్చా?’ అని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య అడిగారు. ‘కన్నడ నా మాతృ భాష కాకపోయినా అన్ని భాషలను గౌరవిస్తాను. ప్రతిఒక్కరు తమ భాషను కాపాడుకోవాలి. కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’ అని ప్రెసిడెంట్ బదులిచ్చారు. కాగా కర్ణాటకలో ఉండేవారు తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని ఇటీవల సిద్దరామయ్య చెప్పడం వివాదాస్పదమైంది.