News August 31, 2025
SKLM: మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ

ఎస్సీ మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 20సంవత్సరాలు వయస్సు పైబడిన ఐదుగురు మహిళ అభ్యర్థులకు మాత్రమే హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. అర్హులైన ఎస్సీ మహిళలు జిల్లా షెడ్యుల్డ్ కులముల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News September 3, 2025
పలాసలో దారుణ హత్య ..!

పలాస(M) కేసుపురంలో మంగళవారం అర్ధరాత్రి చిల్లంగి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు (80) ని రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలువురు దాసుల వద్దకు వెళ్లగా గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 3, 2025
సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు : ఎమ్మెల్సీ కళ్యాణి

2017లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని ఆమె వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
News September 3, 2025
స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు కట్టుబడి ఉండాలి: కలెక్టర్

స్వచ్ఛ శ్రీకాకుళం సాధనతో సహా, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛతను ప్రజల దైనందిన జీవన విధానంలో భాగం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతీ మూడో శనివారం స్వచ్ఛదివాస్ కార్యక్రమాన్ని చేయాలన్నారు.