News August 31, 2025

తర్లుపాడు PSను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

image

తర్లుపాడు పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు పరిశీలించి, స్టేషన్‌ రికార్డులు, నేరాల చరిత్ర, కేసుల పురోగతి, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో SI బ్రహ్మ నాయుడు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 1, 2025

ప్రకాశంలో మోసానికే మోసం..?

image

తాడిని తన్నేవాడుంటే, వాడి తల తన్నేవాడు మరొకడు ఉంటాడనే సామెత పెద్దలు ఊరికే చెప్పలేదేమో. ప్రకాశం జిల్లాలో సేమ్ టు సేమ్ అలాంటి ఘటనే జరిగిందని తెలుస్తోంది. టంగుటూరుకు చెందిన ఓ వ్యాపారి వద్ద పని చేసే గుమస్తా అనుమానం రాకుండా ఏకంగా రూ.20 కోట్లు దండుకున్నాడట. ఈ గుమస్తా ఖాతాను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు సుమారు రూ.7కోట్లు కొట్టేశారని వదంతులు. ఇందులో ఏది నిజమో కానీ, అసలు విషయం వెలుగులోకి రావాల్సి ఉంది.

News September 1, 2025

ఒంగోలులో సందడి చేసిన హీరో నారా రోహిత్

image

ఒంగోలులో ఆదివారం సుందరకాండ చిత్రం యూనిట్ సందడి చేసింది. హీరో నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్రం విజయాన్ని అందుకోవడంతో అన్ని జిల్లాల పర్యటన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా రోహిత్, చిత్ర బృందంతో కలిసి ఆదివారం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలులోని గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్దకు రాగానే ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News September 1, 2025

మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

మార్కాపురం మండలం కోమటికుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి గొట్టిపడియ గ్రామానికి చెందిన కొండయ్యగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను ఇద్దరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.