News August 31, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 31, 2025

దోపిడీ చేసేందుకే ప్రాజెక్టు స్థలాన్ని మార్చారు: రేవంత్

image

TG: తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 14లో కేంద్రం చెప్పినా దోపిడీ చేసేందుకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ‘ఆ విషయం దాచి 2015లో ఉమా భారతి లేఖను పట్టుకుని హరీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు’ అని అసెంబ్లీలో తెలిపారు.

News August 31, 2025

ALERT: మూడు రోజులు భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. TGలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

News August 31, 2025

పుజారాను మెచ్చుకుంటూ మోదీ లేఖ

image

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు <<17502622>>పుజారా<<>> వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ PM మోదీ లేఖ రాసినట్లు పుజారా వెల్లడించారు. ఆయన పంపిన లేఖను SMలో పంచుకున్నారు. సౌరాష్ట్రతో అనుబంధం మొదలు AUSలో డేంజరస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం వరకు ప్రతి అంశాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. పుజారా కుటుంబం చేసిన త్యాగాలనూ ప్రస్తావించారు. తనకు లేఖ రాయడంపై మోదీకి పుజారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.