News August 31, 2025
ఏడాదిలోనే హామీలు అమలు: మంత్రి నారాయణ

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి నారాయణ అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నెల్లూరు నగరంలో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చీ రాగానే పెన్షన్ల పెంపు ద్వారా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని, ప్రతి పిల్లవాడికి రూ.15 వేల చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.
Similar News
News September 3, 2025
కావలిలో దారుణం

కావలిలో చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కుటుంబం 3ఏళ్ల కిందట కావలి మండలానికి వలస వచ్చింది. వీరికి కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉంది. తల్లి కూరగాయల కోసం వెళ్లినప్పుడు బ్రహ్మయ్య(20) బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News September 3, 2025
NLR: గన్‌తో బెదిరించిందని అరుణపై కేసు

ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదంలో తలదూర్చి తనను అరుణ గన్‌తో బెదిరించిందని నెల్లూరు నవాబుపేటకు చెందిన శశి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాను ఆసరాగా చేసుకుని అరుణ సెటిల్మెంట్‌కి ప్రయత్నం చేసింది. ఈక్రమంలో శశికుమార్ వినకపోవడంతో అతన్ని గన్‌తో బెదిరించింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 3, 2025
నెల్లూరులో 20% తక్కువ వర్షపాతం

ఆగస్టు నెలలో 3 అల్పపీడనాలు ఏర్పడి రాష్ట్రంలోని 25 జిల్లాలపై వర్షాలు ప్రభావం చూపాయి. వాటిలో 6 జిల్లాల్లో 20% నుంచి 50% వరకు వర్షపాతం నమోదైంది. అయితే ఒక్క నెల్లూరులో మాత్రమే 20% కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతపురంలో మాత్రం ఈసారి అత్యధిక వర్షపాతం నమోదైంది. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా వాగులు, వంకలు పోంగిపోర్లాయి.