News August 31, 2025
సిద్దిపేట జిల్లాలో ‘డెంగ్యూ’ భయం

సిద్దిపేట జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ జ్వరంతో జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాలకు చెందిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. ఇదే నెలలో దుబ్బాకలోనూ డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దోమకాటు ద్వారా డెంగ్యూ వ్యాపి చెందుతుండగా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News September 3, 2025
APPLY: రూ.1,40,000 జీతంతో 248 పోస్టులు

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) 248 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, JE, సీనియర్ అకౌంటెంట్, సూపర్‌వైజర్(IT), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులను బట్టి డిగ్రీ/బీ.టెక్/సీఏ చదివి ఉండాలి. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.27,000-రూ.1,40,000 వరకు ఉంటుంది. వచ్చే నెల 1లోగా nhpcindia సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News September 3, 2025
కరపలో దారుణం.. తండ్రిని హత్య చేసిన కొడుకు

కరప పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలంక మొండి గ్రామంలో దారుణ ఘటన చోటుచోసుకుంది. కే. సూర్యచంద్ర (50)ను అతని కుమారుడు చంద్రశేఖర్ బుధవారం తెల్లవారుజామున హత్య చేశాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సునీత బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News September 3, 2025
ఉయ్యూరు: లైన్‌మెన్‌పై బూతు పురాణం

ఉయ్యూరు పెద్దఓగిరాల కరెంట్ సబ్-స్టేషన్ లైన్‌మెన్ నాగరాజును లైన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ బూతులు తిట్టిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కరివేపాకు తీసుకురమ్మని లైన్‌మెన్‌కి చెప్పారు. వేరే పని ఉండటం వల్ల తేలేకపోయానని చెప్పడంతో ఫోన్‌లో లైన్‌మెన్‌పై అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.