News August 31, 2025
నేడు, రేపు వర్షాలు

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, MHBD, WGL, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News September 3, 2025
నేను చాలా యాక్టివ్‌గా ఉన్నా: ట్రంప్

సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ వింటున్నానని, అవన్నీ అవాస్తవాలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. గత వారం రోజులుగా తాను గోల్ఫ్ ఆడుతూ చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా కొద్ది రోజులుగా ట్రంప్ బహిరంగంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ‘<<17563031>>ట్రంప్ ఈజ్ డెడ్<<>>’ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
News September 3, 2025
వైసీపీ ఎమ్మెల్యేలకు ఇదే నా విజ్ఞప్తి: స్పీకర్

AP: చంద్రబాబుకు ధైర్యముంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్న <<17591420>>సజ్జల<<>> కామెంట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. ‘పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి. సభకు రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి. స్పీకర్‌గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా’ అని ట్వీట్ చేశారు.
News September 3, 2025
APPLY: రూ.1,40,000 జీతంతో 248 పోస్టులు

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(NHPC) 248 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, JE, సీనియర్ అకౌంటెంట్, సూపర్‌వైజర్(IT), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి. వయసు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులను బట్టి డిగ్రీ/బీ.టెక్/సీఏ చదివి ఉండాలి. జీతం పోస్టులను బట్టి నెలకు రూ.27,000-రూ.1,40,000 వరకు ఉంటుంది. వచ్చే నెల 1లోగా nhpcindia సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.