News August 31, 2025
RRను వీడిన ద్రవిడ్.. కారణాలు ఇవేనా?

రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా <<17562348>>రాహుల్ ద్రవిడ్<<>> కొనసాగకపోవడానికి గల కారణాలను క్రిక్‌బజ్ అంచనా వేసింది. గత సీజన్‌లో టీమ్ వైఫల్యం (9వ స్థానం), కెప్టెన్ శాంసన్‌తో చిన్నపాటి భేదాభిప్రాయాలు, అతడు RRను వీడాలనుకోవడం, వేరే రోల్‌కు ద్రవిడ్ నిరాకరించడం వంటివి కారణం అయ్యుండొచ్చని పేర్కొంది. ఆ జట్టుకు మళ్లీ సంగక్కర తిరిగి కోచ్‌గా రావొచ్చని, శాంసన్ RRను వీడి వేలంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
Similar News
News September 3, 2025
నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడికి సూచనలు

2 కేజీల ట్రైకోడెర్మావిరిడె/సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మందును 90 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వేపపిండితో కలిపి నీడలో పొరలు పొరలుగా ఒక కుప్పగా వేసుకోవాలి. దానిపై గోనెకప్పి బెల్లం కలిపిన నీటిని ఒక వారం పాటు చల్లాలి. దీని వల్ల దానిలో శిలీంద్రబీజాలు/బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా తయారైన దానిని పశువుల ఎరువుతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇది నేలసారాన్ని పెంచి తెగుళ్ల ఉద్ధృతిని తగ్గిస్తుంది.
News September 3, 2025
పంటలలో తెగుళ్ల నివారణకు సూచనలు

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.
News September 3, 2025
డీజేల దగ్గర డాన్స్ చేస్తున్నారా? జాగ్రత్త

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 ఏళ్ల యువకుడు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఏ సంగీతమైనా నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే గుండెపై హానికర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
Share it