News August 31, 2025
NZB: NDRF, SDRF సేవలు భేష్..

ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.
Similar News
News September 1, 2025
NZB: అశోక్‌సాగర్ కెనాల్‌లో మృతదేహం కలకలం

NZB శివారులోని అశోక్‌సాగర్ కెనాల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు 6వ టౌన్ SI వెంకట్రావు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు 35-40 సంవత్సరాల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. క్రీం కలర్ డబ్బాల షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, క్లాసిక్ టైలర్ నవీపేట అని ఉందని సూచించారు.
News September 1, 2025
NZB: గణపతుల నిమజ్జనానికి ఇలా వెళ్లాలి: CP

8 ఫీట్ల లోపు విగ్రహాలు నెహ్రూపార్క్, అర్సపల్లి, జాన్కంపేట్, నవీపేట మీదుగా బాసరకు వెళ్లాలని CP సాయిచైతన్య చెప్పారు. 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలు పులాంగ్, ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, శివాజీ చౌక్, దుబ్బా, జీజీ కాలేజీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, ముబారక్ నగర్, మాణిక్ బండార్, దాస్ నగర్, మాక్లూర్, నందిపేట్ మండలంలోని ఉమ్మెడ వద్ద గోదావరి బ్రిడ్జి వద్దకు వెళ్లాలన్నారు.
News September 1, 2025
NZB: ధ్వంసమైన అంతర్రాష్ట్ర బ్రిడ్జి

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం బ్రిడ్జి వరద కారణంగా ధ్వంసమైంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో మునిగిపోయింది. బ్రిడ్జిపై నుంచి సైతం వరద నీరు ప్రవహించడంతో రోడ్డు మార్గం ధ్వంసం అయింది. మహారాష్ట్ర నుంచి వరద నీరు తగ్గుముఖం పడటంతో త్రివేణి సంగమం వద్ద సైతం వరద ఉద్ధృతి తగ్గింది.