News August 31, 2025

ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే!

image

AP: సాధారణంగా మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలను ఈసారి FEBలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సిద్ధమైంది. CBSEతో పాటు ఎగ్జామ్స్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు తగినట్లు షెడ్యూల్‌లో మార్పులు చేసింది. తొలుత సైన్స్ స్టూడెంట్స్‌కు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు స్టార్ట్ అవుతాయి. తర్వాత లాంగ్వేజ్, చివర్లో ఆర్ట్స్ గ్రూప్ వారికి ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్స్ నిర్వహణపై క్లారిటీ రావాల్సి ఉంది.

Similar News

News September 4, 2025

18% జీఎస్టీలోకి ఇవే..

image

సామాన్యులకు ఊరట కల్పించేలా టీవీలపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి కేంద్రం తగ్గించింది. పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లు(1,200cc- ఆ లోపు), డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు(1500cc- ఆ లోపు), 3 వీలర్స్, మోటార్ సైకిల్స్(350cc-ఆ లోపు), గూడ్స్ మోటార్ వెహికల్స్, ఏసీలు, అన్ని టెలివిజన్లు, మానిటర్స్, ప్రొజెక్టర్స్, వాషింగ్ మెషీన్స్, సిమెంట్ వంటివి ఈ శ్లాబులోకి రానున్నాయి.

News September 3, 2025

5శాతం శ్లాబులోకి వచ్చిన వస్తువులివే..

image

సబ్బులు, షాంపూలు, టూత్‌బ్రష్‌లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్‌‌తో పాటు సైకిళ్లపై గతంలో 18% GST ఉండగా ఇప్పుడు 5% శ్లాబులోకి తీసుకొచ్చారు. వెన్న, నెయ్యి, చీజ్, డెయిరీ ప్రొడక్ట్స్, ప్రీ ప్యాకేజ్డ్ నమ్‌కీన్, గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, న్యాప్‌కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% శ్లాబులో ఉండగా ఇప్పుడు 5శాతంలోకి తెచ్చారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలూ ఇందులోనే ఉన్నాయి.

News September 3, 2025

వీటిపై GST తొలగింపు

image

* వ్యక్తిగత, టర్మ్, హెల్త్ బీమా పాలసీలు(18% to 0%)
* మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్(12 to 0)
* పెన్సిల్స్, క్రేయాన్స్, షార్ప్‌నర్స్, పాస్టల్స్(12 to 0)
* ఎక్సర్ సైజ్ బుక్స్, నోట్ బుక్స్(12 to 0)
* 33 ప్రాణాధార ఔషధాలు(12 to 0)
* ఎరేజర్స్(5 to 0)
* ఇండియన్ పరోటా, అన్ని రకాల బ్రెడ్లు