News August 31, 2025
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: హైకోర్టు

TG: 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చట్టప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని, వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలిచ్చారు.
Similar News
News September 4, 2025
GREAT.. 10th చదివి ఆర్థిక క్రమశిక్షణతో రూ.కోటి పొదుపు!

ఆర్థిక క్రమశిక్షణతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఓ వ్యక్తి కథ నెటిజన్లను మెప్పిస్తోంది. తాను పదో తరగతి మాత్రమే చదివి 25 ఏళ్లలో రూ.కోటి పొదుపు చేసినట్లు 53 ఏళ్ల వ్యక్తి రెడిట్‌లో పోస్ట్ చేయగా వైరలవుతోంది. తాను నెలకు రూ.4,200 జీతంతో జీవితాన్ని ప్రారంభించానని, ఎప్పుడూ అప్పు చేయలేదని, క్రెడిట్ కార్డు వాడలేదని తెలిపారు. చాలావరకూ నడుస్తూనే వెళ్తానని, ఈ మధ్యే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నానన్నారు.
News September 4, 2025
సెప్టెంబర్ 4: చరిత్రలో ఈ రోజు

1825: జాతీయ నేత దాదాభాయి నౌరోజీ జననం(ఫొటోలో)
1924: కేంద్ర మాజీ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి జననం
1926: శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత బాలు శంకరన్ జననం(ఫొటోలో, కుడివైపు)
1962: భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే జననం
1980: తెలుగు సింగర్, డాన్సర్ స్మిత జననం
1983: పాత తరం తెలుగు సినీ నటి ఛాయాదేవి మరణం
2007: తెలుగు, తమిళ, హిందీ నటి వై.రుక్మిణి మరణం
* జాతీయ వన్యప్రాణుల దినోత్సవం
News September 4, 2025
గోదావరి ఉద్ధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

TG: భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. నిన్న ఉదయం 10 గంటలకు 39 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం రాత్రి 10 గంటల సమయానికి 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.