News August 31, 2025
మంత్రాలయం: పట్టు వదలని విక్రమార్కుడు.!

మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన నరసింహులు పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేసి తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీలో ఉద్యోగం సంపాదించాడు. నరసింహులు ఒకవైపు ప్రైవేటుగా చేస్తూ మరో వైపు 11 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఉద్యోగం సంపాదించాడు. 2014, 2018 డీఎస్సీ పరీక్ష రాయగా స్వల్ప మార్కుల తేడాతో మిస్సయ్యాడు. అయినా కూడా పట్టు వదలకుండా సాధన చేసి 48వ ర్యాంకుతో పీఈటీగా ఎంపికయ్యాడు.
Similar News
News September 4, 2025
ఈనెల 8 న జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు

ఈనెల 8న కర్నూలులోని బి.క్యాంప్ క్రీడా మైదానంలో బాల బాలికలకు హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్ బాల్ సంఘం జిల్లా కార్యదర్శి పి.సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 నుంచి 2015 మధ్యలో జన్మించిన బాల బాలికలు పోటీలకు అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 14న డోన్‌లోని కోట్ల స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.
News September 3, 2025
కర్నూలు: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా గోపాలచార్యులు

కర్నూలు(D)కు గర్వకారణంగా సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డికి చెందిన ముతుకూరి గోపాలచార్యులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు పండితుడిగా జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఈయన.. విద్యార్థులతో పాటలు పాడిస్తూ, రాయిస్తూ విద్యను సృజనాత్మకంగా నేర్పుతున్నారు. ఈనెల 5న టీచర్స్ డే సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. గోరంట్లకు చెందిన వీరి కుటుంబంలో 6గురు టీచర్లుండటం విశేషం.
News September 3, 2025
రూ.కోటి విరాళం ప్రకటించిన మంత్రి టీజీ భరత్

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి టీజీవీ సంస్థల తరఫున రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. అమరావతిలో ఏపీ ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం ఏర్పాటు చేయనున్నాయి. వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి భరత్ ఈ విరాళం ప్రకటించారు.