News August 31, 2025

ఇటు కాళేశ్వరం.. అటు బీసీ రిజర్వేషన్లు!

image

TG: అత్యవసరంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ హాట్‌హాట్‌గా సాగనున్నాయి. కాళేశ్వరం నివేదిక, BC రిజర్వేషన్ల కొత్త బిల్లుకు ఆమోదం తెలపడం వంటి రెండు కీలక అంశాలపై సభలో చర్చ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా, BC రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మల్చుకునేలా అధికార పార్టీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టాలని BRS భావిస్తోంది.

Similar News

News September 1, 2025

CBIకి ‘కాళేశ్వరం కేసు’.. బండి సంజయ్ ఏమన్నారంటే?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘మేం మొదటి నుంచీ CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం. కానీ INC ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించేందుకు అంగీకరించింది. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీరియల్‌లా సాగుతోంది’ అని ట్వీట్ చేశారు.

News September 1, 2025

పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే: PM మోదీ

image

చైనాలో SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ ఆయనను హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడిన ఫొటోలను Xలో షేర్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ సంభాషించినట్లు పేర్కొన్నారు.

News September 1, 2025

నేడు గవర్నర్ వద్దకు అఖిలపక్ష నేతలు

image

TG: అసెంబ్లీలో ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరేందుకు ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. తమతో కలిసి రావాలని అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. ‘రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలి. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఇబ్బంది ఏముంది?’ అని మంత్రి వ్యాఖ్యానించారు.