News August 31, 2025
VZM: నేడు జిల్లాకి రానున్న గోవా గవర్నర్

గవర్నర్ హోదాలో పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారి జిల్లాకు రానున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో ఉంటారు. సెప్టెంబర్ 1న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. 2వ తేదిన కోటలోని మోతీమహల్‌ను ప్రారంభిస్తారు. 3వ తేదిన సింహాచలం శ్రీవరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, 4న గోవాకు తిరుగు పయనమవుతారని అశోక్ బంగ్లా వర్గాలు వెల్లడించాయి.
Similar News
News September 4, 2025
ర్యాగింగ్ జరగకుండా చర్యలు చేపట్టండి: SP

విద్యా సంస్థల్లో ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాడని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులను బుధవారం ఆదేశించారు. ర్యాగింగ్ వలన కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించి, అవగాహన కల్పించాలని సూచించారు. తమ పరిధిలోగల ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలను, ఇతర విద్యాలయాలను సందర్శించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
News September 3, 2025
‘పారదర్శకంగానే DSC అభ్యర్థుల ఎంపిక’

2025 డీఎస్సీ పరీక్ష రాసి అర్హత సాధించిన ఉపాద్యాయుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు రీ వేర్ఫికెషన్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు ఎటువంటి అపోహలు పడొద్దని, అభ్యంతరాలుంటే DEOని సంప్రదించాలన్నారు.
News September 3, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో ఎరువులకు కొరత లేదని, ప్రస్తుత పంటలకు అవసరమైనంత ఎరువుని ఇప్పటికే సరఫరా చేశామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, SPలతో CM చంద్రబాబు బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా.. జిల్లా పరిస్థితులను కలెక్టర్ వివరించారు. ఇప్పటికే సుమారు 30వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు సరఫరా చేశామని, ఇంకా 37,600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు.