News August 31, 2025
ఏటీఎంలలో చోరీ.. యూపీ ముఠా అరెస్ట్: సీఐ

పరవాడ ప్రాంతాల్లో ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన యూపీకి చెందిన ముగ్గురిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈనెల 27న నిందితులు పరవాడ,దేశపాత్రునిపాలెం ఏటీఎంలలో డూప్లికేట్ తాళాలతో సేఫ్ డోర్ తెరిచి డిస్పెన్సర్ డోర్ వద్ద స్టిక్కర్లు అతికించారు. కస్టమర్లు విత్ డ్రా చేసిన నగదు బయటకు రాకుండా అందులో ఉండిపోయింది. తర్వాత నిందితులు ఏటీఎంలలోకి ప్రవేశించి నగదు తీసుకున్నారు.
Similar News
News September 4, 2025
కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.30కి లింగంపేట(M) మోతె గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. 1:10PMకు కామారెడ్డి టౌన్‌లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. 2:20PMకు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు.
News September 4, 2025
శాస్త్రి ఇండో కెనడియన్ ప్రాజెక్టుకు మహిళా వర్సిటీ ఎంపిక

కెనడాలోని శాస్త్రి ఇండో కెనడియన్ అంతర్జాతీయ ప్రాజెక్టుకు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఎంపికైనట్లు వీసీ ఆచార్య వి.ఉమ
బుధవారం తెలిపారు. ఈ ప్రాజెక్టు చేయడానికి భారతదేశం నుంచి మొత్తం 30 దేశాలు దరఖాస్తు చేసుకోగా 4 యూనివర్సిటీలు మాత్రమే ఎంపికయ్యాయన్నారు. రెండేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టుకు ఏపీ నుంచి పద్మావతి మహిళా వర్సిటీ మాత్రమే ఎంపికవడం గర్వకారణమన్నారు.
News September 4, 2025
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శేషఫణి ఎంపిక

నంద్యాల పట్టణ సమీపంలోని బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శేషఫణి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. శేషఫణి పనిచేసిన పాఠశాలలలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈనెల 5న విజయవాడలో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్నారు. పట్టణ ప్రముఖులు శేషఫణికి అభినందనలు తెలిపారు.