News August 31, 2025

నెల్లూరు జిల్లాలో ఆ బార్లు అన్నీ క్లోజ్..!

image

నూతన పాలసీ కింద నెల్లూరు జిల్లాలో 55 బార్లు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 21షాపులకు మాత్రమే 94 అప్లికేషన్లు వచ్చాయి. నెల్లూరులో 15, కావలిలో 3, కందుకూరులో 3.. మొత్తం 21 బార్లను కొత్తవారికి లాటరీ ద్వారా కేటాయించారు. ఇవి కాకుండా జిల్లాలో ప్రస్తుతం 47 బార్లుకు లైసెన్స్ ముగిసింది. వీటిని నేటి రాత్రి నుంచి పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఇకపై నెల్లూరు, కావలి, కందుకూరులోనే బార్లు అందుబాటులో ఉండనున్నాయి.

Similar News

News September 3, 2025

NLR: రూ.లక్షకుపైగా స్కాలర్‌షిప్.. ఇలా చేయండి

image

నెల్లూరు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం యశస్వి స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించింది. వార్షికాదాయం రూ.2.50లక్షల లోపు ఉన్న బీసీ, ఓబీసీ, మైనార్టీ, డీఎన్టీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. 9, 10వ తరగతి వాళ్లకు రూ.75 వేలు, ఇంటర్ వాళ్లకు గరిష్ఠంగా రూ.1.25లక్షలు స్కాలర్‌షిప్‌గా ఇస్తారు. ఈ <>లింకుపై <<>>క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
Share It.

News September 3, 2025

కావలిలో దారుణం

image

కావలిలో చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కుటుంబం 3ఏళ్ల కిందట కావలి మండలానికి వలస వచ్చింది. వీరికి కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉంది. తల్లి కూరగాయల కోసం వెళ్లినప్పుడు బ్రహ్మయ్య(20) బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

News September 3, 2025

NLR: గన్‌తో బెదిరించిందని అరుణపై కేసు

image

ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదంలో తలదూర్చి తనను అరుణ గన్‌తో బెదిరించిందని నెల్లూరు నవాబుపేటకు చెందిన శశి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాను ఆసరాగా చేసుకుని అరుణ సెటిల్మెంట్‌కి ప్రయత్నం చేసింది. ఈక్రమంలో శశికుమార్ వినకపోవడంతో అతన్ని గన్‌తో బెదిరించింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.