News August 31, 2025

అనంత: గమనిక ‘రూట్ మారింది’

image

తాడిపత్రి నుంచి నంద్యాల, కడపకు వెళ్లే వాహనాలను డైవర్ట్ చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురం నుంచి కడపకు వెళ్లేందుకు శివుడి విగ్రహం నుంచి ఆటోనగర్ మీదుగా, అనంతపురం టు నంద్యాలకు శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ మీదుగా, చుక్కలూరు బ్రిడ్జి సజ్జలదిన్నె క్రాస్ బుగ్గ మీదుగా, కడప నుంచి నంద్యాలకు వెళ్లాలన్నా ఇదే మార్గంలో వెళ్లాలని సూచించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మళ్లింపు ఉంటుందన్నారు.

Similar News

News September 3, 2025

పుట్లూరులో రైతు ఆర్థిక సంక్షోభానికి సీఎం చలించి సహాయం

image

పుట్లూరుకు చెందిన తలారి శ్రీనివాసులు చిన్న రైతు. కుక్కల దాడిలో తన గొర్రెలన్నింటినీ కోల్పోయి తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారు. ముగ్గురు ఆడపిల్లలు. అందులో ఒకరు దృష్టి లోపంతో బాధపడుతున్నారు. కుటుంబం తీవ్ర సంక్షోభంలో పడింది. పరిస్థితిని MP అంబికా లక్ష్మీనారాయణ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం తక్షణమే స్పందించి రూ.2.4 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. ఈ చర్య రైతుకు మానసికంగా మద్దతునిచ్చింది.

News September 3, 2025

జిల్లాలో బీడు భూములు ఉండకూడదు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో బీడు భూములు ఉండకూడదని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. బీడు భూమిలో ఉద్యాన పంటలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ ఉండాలని చెప్పారు. ఏడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తగా ఎంపిక చేసిన గ్రామాలకు వార్షిక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

News September 2, 2025

స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖలు పనిచేయాలి: కలెక్టర్

image

స్వయం సహాయక సభ్యులు, రైతు సంఘాల సభ్యులకు సుస్థిరమైన జీవనోపాధి, స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులు పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.