News August 31, 2025

లింగ నిర్ధారణకు పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

image

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News September 3, 2025

భీమవరం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

రైతులను మోసం చేసేందుకు కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పౌరసరఫరాల, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అధిక ధరలకు అమ్మే దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

News September 3, 2025

భీమవరం: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో వర్క్ ఫ్రం హోం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాహనాల ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, వర్క్ ఫ్రం హోం, ఈ-కేవైసీ వంటి అంశాలపై ఆమె చర్చించారు. ‘తల్లికి వందనం’ పథకంలో నగదు జమలో ఉన్న అడ్డంకులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

News September 3, 2025

డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ నాగరాణి

image

ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద డబ్బులు వసూలు చేసినట్లు రుజువైతే పెనాల్టీతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు ఆసుపత్రులపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత కమిటీతో కలిసి ఆమె విచారణ చేపట్టారు. భీమవరం ఒమేగా, రాజర్షి, శ్రీలక్ష్మి, మదర్‌వాణి, తణుకు ఆపిల్ ఆసుపత్రులతో సహా మొత్తం 16 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు వచ్చినట్లు ఆమె తెలిపారు.