News August 31, 2025
కడప: రేషన్ కార్డుదారులకు ఉచితంగా జొన్నలు

చౌకా దుకాణాల ద్వారా సెప్టెంబరు నుంచి లబ్ధిదారులకు ఉచితంగా జొన్నలు అందించనున్నట్లు జేసీ అతిథి సింగ్ శనివారం తెలిపారు. బియ్యం కార్డులో ముగ్గరు సభ్యులు కన్నా తక్కువ ఉంటే ఒక కిలో మాత్రమే ఇస్తామన్నారు. సభ్యులు ఎక్కువ ఉంటే రెండు కిలోలు జొన్నలు బియ్యానికి బదులుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంత్యోదయ, అన్నయోజన వారు కూడా అర్హులన్నారు.
Similar News
News September 4, 2025
కడప: నేటి నుంచి మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్ల ప్రారంభం

జిల్లాలో ఉల్లి పంటను సాగుచేసిన రైతులు ఈ క్రాప్ చేయించుకుని ఉంటే అటువంటి వారికి ప్రభుత్వం గురువారం నుంచి ఉల్లి కొనుగోలు చేస్తుందని జేసీ ఆదితి సింగ్ గురువారం తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటా ఉల్లి ధర రూ.1200 మాత్రమే అని, కమలాపురం, మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాలలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News September 4, 2025
సెలవులో వెళ్లనున్న కడప కలెక్టర్

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వ్యక్తిగత పని నిమిత్తం సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు యూకేకి వెళ్తున్నారు. ప్రస్తుత జేసీ అదితి సింగ్ కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 4, 2025
9న కడపలో గండికోట ముంపు వాసుల సమీక్ష.!

గండికోట ముంపు వాసుల సమీక్ష సమావేశం ఈనెల 9న కడప కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. సమావేశంలో కొండాపురం మండలంలోని ఓవన్నపేట, చౌటపల్లి, బొమ్మపల్లి మరో 11 గ్రామాల గృహాల పునరావాస పరిహారంపై చర్చించనున్నారు. జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డి, అధికారులు పాల్గొంటారు. వీరితోపాటు కొంతమంది ముంపు బాధితులు వెళ్లనున్నారు.