News August 31, 2025
మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు: MLA గంగుల

TG: BCలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా అమలైతే తామూ సంతోషిస్తామని BRS MLA గంగుల కమలాకర్ తెలిపారు. ‘మేం BC బిల్లుకు గతంలో మద్దతు ఇచ్చాం. శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అవుతుందని, అశాస్త్రీయంగా వెళ్తే కోర్టులో మొట్టికాయలు పడతాయని చెప్పాం. మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వేసిన BC కమిషన్ మాయమైంది’ అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
Similar News
News September 4, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

✦ SLBC టన్నెల్ పనులను 2028 జనవరి నాటికి పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
✦ ఆస్పత్రుల్లో 8 ఏళ్లు దాటిన మెషీన్లను స్క్రాప్ చేయాలి.. మంత్రి రాజనర్సింహ ఆదేశాలు
✦ గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు డిగ్రీ ఉంటే గ్రేడ్-3 క్లర్క్ పోస్టులు: సింగరేణి
✦ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 2,116 మందిని ఎంపిక చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు
News September 4, 2025
ఈ బైకుల ధరలు తగ్గుతాయి

ప్రస్తుతం అన్ని రకాల బైకులపై 28% GST విధిస్తున్నారు. 350 cc కంటే ఎక్కువ కెపాసిటీ ఉంటే అదనంగా 2-3% సెస్ విధిస్తున్నారు. తాజా మార్పులతో 350 cc, అంతకంటే తక్కువ ఉన్న బైకులపై 18%, అంతకంటే ఎక్కువ ఉన్న బైకులపై 40% ట్యాక్స్ పడనుంది. కొత్త విధానంలో సెస్ ఉండదు.
*350 cc కంటే తక్కువ కెపాసిటీ బైకులు: యాక్టివా, షైన్, TVS జూపిటర్, బజాజ్ పల్సర్, హీరో స్ప్లెండర్, గ్లామర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, హంటర్ etc.
News September 4, 2025
118 ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు https://www.tgprb.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు SC, ST అభ్యర్థులకు ₹1000, మిగతా వారికి ₹2000. అభ్యర్థులు క్రిమినల్ కోర్టుల్లో 3 ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <