News August 31, 2025

రేపు పులివెందుల రానున్న YS జగన్

image

కడప జిల్లాలో మూడు రోజులపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించానున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్యాహ్నానికి పులివెందుల చేరుకోనున్న జగన్, రెండో తేదీ ఉదయం తన తండ్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలలో నివాళులర్పిస్తారు. అనంతరం లింగాల మండలం అంబకంపల్లి చేరుకొని జలహారతిలో పాల్గొంటారు. పులివెందుల చెరుకుని రాత్రికి బస చేసి మూడవ తేదీ ఉదయం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

Similar News

News September 3, 2025

AUTO MATE యాప్‌ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

image

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్‌ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.

బెంగుళూరుకు పయనమైన వైఎస్ జగన్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు పయనమయ్యారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు వీడ్కోలు పలికారు.