News August 31, 2025

ఆరునూరైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: CM

image

TG: ఆరునూరైనా BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. BC రిజర్వేషన్ల కోసం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశామని, అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి దగ్గర ఉందని, ఈ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. దీనిపై ఢిల్లీలో తాము ఆందోళన చేస్తే BRS MPలు ఎందుకు రాలేదని అసెంబ్లీలో CM ప్రశ్నించారు.

Similar News

News September 1, 2025

సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు?

image

దేవుళ్లు, దేవతలకు వాహనాలతోపాటు ఆయుధాలు కూడా ఉంటాయి. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎంతో ప్రత్యేకం. ఈ ఆయుధ ప్రస్తావన శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో ఉంది. పూర్వం రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దీంతో రాక్షసులను ఓడించే దివ్య ఆయుధం కోసం ఆయన శివుడిని ప్రార్థించారు. దీంతో ముక్కంటి సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణువుకు అందించారని శాస్త్రాలు చెబుతున్నాయి.

News September 1, 2025

చెప్పులో దూరిన పాము.. చూడకుండా ధరించడంతో!

image

వర్షాల వల్ల సర్పాలు, కీటకాలు ఇళ్ల బయట ఉంచిన చెప్పులు, హెల్మెట్స్‌లో తలదాచుకుంటుంటాయి. అలా బెంగళూరులో మంజు ప్రకాశ్ అనే యువకుడు ఇంటి బయట ఉంచిన చెప్పులను పరిశీలించకుండా ధరించాడు. దీంతో అందులో ఉన్న పాము కాటేసింది. గతంలో ఓ ప్రమాదం వల్ల ప్రకాశ్ తన కాలులో స్పర్శ కోల్పోవడంతో కాటేసినట్లు తెలియలేదు. అరగంట పాటు ఆ చెప్పులతోనే నడిచి ఇంటికెళ్లిన కొద్దిసేపటికే చనిపోయాడు. పాము కూడా మరణించింది.

News September 1, 2025

యమ ధర్మరాజు ప్రకారం పాపాలు ఏంటి?

image

పుణ్యాలు చేసిన వాళ్లు స్వర్గానికి, పాపాలు చేసిన వాళ్లు నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. యమధర్మరాజు ప్రకారం.. తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తులను తిట్టి హింసించేవారు, పరస్త్రీలను కామించేవారు, గోహత్య, శిశుహత్య చేసినవారు మహాపాపులవుతారు. ఇతరుల ఆస్తులను దోచుకొనేవారు, శరణుజొచ్చినవారిని కూడా బాధించేవారు, వివాహాది శుభకార్యాలకు అడ్డుతగిలేవారు కూడా పాపాత్ములే.