News August 31, 2025
Way2News EXCLUSIVE… కాళేశ్వరం రిపోర్ట్

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 665 పేజీలతో ప్రవేశపెట్టిన ఈ రిపోర్టును <
Similar News
News September 1, 2025
3 రోజుల ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్

AP: నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే <<17552037>>కేసులో<<>> సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్‌ను ఏసీబీ విచారించనుంది. వారం రోజులు విచారణకు అనుమతివ్వాలన్న పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు ఆయనను కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపట్నుంచి అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. ఉ.8- సా.6 గంటల వరకు ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది.
News September 1, 2025
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్పెషల్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. రేపు బర్త్ డే సందర్భంగా పవన్‌కు విషెస్ తెలియజేస్తూ రాకింగ్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News September 1, 2025
సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు?

దేవుళ్లు, దేవతలకు వాహనాలతోపాటు ఆయుధాలు కూడా ఉంటాయి. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎంతో ప్రత్యేకం. ఈ ఆయుధ ప్రస్తావన శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో ఉంది. పూర్వం రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దీంతో రాక్షసులను ఓడించే దివ్య ఆయుధం కోసం ఆయన శివుడిని ప్రార్థించారు. దీంతో ముక్కంటి సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణువుకు అందించారని శాస్త్రాలు చెబుతున్నాయి.