News August 31, 2025
NLG: పత్తి రైతు పరేషాన్.. దిగుబడిపై ప్రభావం

ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి చేలలో ఇంకా తడారలేదు. వరద నీటిలోనే మొక్కలు ఉండడం అధిక తడితో మొలకలు ఎర్రబారుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మొక్కలు ఎదిగే సమయానికి భారీ వర్షాలు కురవడంతో చాలాచోట్ల పత్తి చేలల్లోకి నీళ్లు వచ్చాయని రైతులు తెలిపారు. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News September 3, 2025
నల్గొండ: వినాయకుడి నిమజ్జనం ఇక్కడే..

వినాయక నిమజ్జనానికి జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ భారీ ఏర్పాట్లు చేసిందని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన నల్గొండలోని వల్లభరావు చెరువు, మూసీ నది,14వ మైలు, మిర్యాలగూడలోని వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలగండి, అడవిదేవులపల్లి, దేవరకొండలోని కొండబీమనపల్లి, డిండి వద్ద బందోబస్తు కట్టుదిట్టం చేశారు. పికెట్లు, ప్లడ్ లైట్లు, క్రేన్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
News September 3, 2025
పోలీసుల సూచనలను పాటించాలి: నల్గొండ ఎస్పీ

గణేష్ నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలను పాటించాలని ఎస్పీ శరత్చంద్ర పవర్ నిర్వాహకులను కోరారు. చిన్నపిల్లలు, మహిళలు వృద్దులు జాగ్రత్తగా ఉండాలని, గుంపుల వద్ద వాహనాలలో టపాకులు పేల్చవద్దని సూచించారు. నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని, స్వచ్ఛంద సేవకుల విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు. అత్యవసరమైతే 100, 112కు కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.
News September 3, 2025
NLG: పంట నష్టం పై సర్వే..!

జిల్లాలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై అధికారులు సర్వే మొదలు పెట్టనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరి, పత్తి పంటలకు సంబంధించి 284 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. నష్టం అంచనాలు తయారు చేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇవాల్టి నుంచి వారం పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులు సర్వే నిర్వహించనున్నారు.