News August 31, 2025

HYD: సండే ఆన్ సైక్లింగ్ ప్రారంభించిన గవర్నర్

image

HYDలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ 2025లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సైక్లింగ్ శారీరక, మానసిక బలాన్ని పెంచుతుందని గవర్నర్ అన్నారు. ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 3, 2025

నకిలీ కాల్స్‌పై ఉద్యోగులకు ఏసీబీ సూచనలు

image

నకిలీ కాల్స్‌తో ఉద్యోగులను మోసగాళ్లు భయపెడుతున్న నేపథ్యంలో ACB హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ 91548 93428 నంబర్‌ నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు సైఫాబాద్ PSలో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. అధికారులు ఎప్పుడూ డబ్బులు అడగరు, నకిలీ కాల్స్ నమ్మొద్దు, డబ్బులు చెల్లించొద్దంటు ఏసీబీ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలంది.

News September 3, 2025

HYD: లంచం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

image

HYDలో GST/కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనీయర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం కేసులో అరెస్టు చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి ₹30,000 లంచం డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ₹25,000కు ఒప్పుకున్నారు. సీబీఐ బృందం రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేసింది. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

News September 3, 2025

గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీపై HYD సీపీ సమీక్ష

image

సీపీ సీవీ ఆనంద్ గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల భద్రతా ఏర్పాట్లపై HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోనల్ ఆఫీసర్లు, లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో భద్రత ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహిస్తామని తెలిపారు.