News August 31, 2025
HYD: GREAT: పర్యావరణం కోసం ముసలవ్వ పిలుపు.!

కాప్రా చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గుల్షాన్ బంబాత్ చిన్న గణపతి విగ్రహాల ద్వారానే ఎక్కువ విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటాయని అభిప్రాయపడ్డారు. చెరువులను కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆమె రాత్రిపూట కూడా చెరువు దగ్గరే ఉన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. “చెరువులు కలుషితం కావొద్దంటే, మనందరం మారుదాం” అని ఆమె పేర్కొన్నారు
Similar News
News August 31, 2025
మోమిన్‌పేటలో భర్తను చంపేసిన భార్య

మోమిన్‌పేట మండలం కేసారంలో దారుణం చోటుచేసుకుంది. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన కురువ కుమార్ (36), రేణుక (34) భార్యభర్తలు. కేసారంలోని ఒక వెంచర్‌లో పని చేస్తున్నారు. రోజూ మద్యం తాగి భార్యను వేధిస్తున్న కుమార్ ఆదివారం మద్యం మత్తులో వచ్చి రేణుకను కొట్టాడు. వేధింపులు తాళలేక ఆమె భర్త కళ్లల్లో కారం కొట్టింది. ఓ వైర్‌ను మెడకు బిగించి హత్య చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 31, 2025
జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు: KA పాల్

రానున్న ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఏడాదిలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలను ఇప్పిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ తెలియజేశారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశం అల్లకల్లోలం అవుతోందన్నారు.
News August 31, 2025
HYD: చిట్టి గణపయ్యకు చిన్న జీపు

వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నగరంలో నిమజ్జనాల ఊరేగింపులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మాదన్నపేటలో ఓ చిన్నారి చిట్టి గణపయ్య కోసం చిన్న జీపును సిద్ధం చేసింది. గణపయ్యను ఆ వాహనం మీద ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.