News August 31, 2025
రేపు గవర్నర్‌ను కలుస్తాం: పొన్నం

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రేపు కలవనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రధాని మోదీ, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. BRS సహా అన్ని పార్టీల నేతలనూ గవర్నర్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News September 4, 2025
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.
News September 4, 2025
జాగృతిలో చీలికలు.. BRS కోసమే పనిచేస్తామంటున్న నేతలు

TG: బీఆర్ఎస్‌ను కవిత వీడటంతో దాని అనుబంధ సంస్థగా ఉన్న జాగృతిలో చీలికలు బయటపడుతున్నాయి. కవిత తమను నడిరోడ్డుపై పడేసిందని జాగృతి నేత రాజీవ్ సాగర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి తమదేనని, కేసీఆర్ చెప్పిందే చేస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి బోర్డు పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. దీనిపై జాగృతి ఫౌండర్ కవిత స్పందించాల్సి ఉంది.
News September 4, 2025
చైనా హ్యాకర్ల చేతిలో అమెరికన్ల డేటా!

అమెరికాను ‘సాల్ట్ టైఫూన్’ అనే పేరు భయపెడుతోంది. చైనాకు చెందిన ఈ సైబర్ ముఠా అమెరికాలోని ప్రతి పౌరుడి డేటాను హ్యాక్ చేసిందని సెక్యూరిటీ నిపుణులు భయపడుతున్నారు. ఈ ముఠా 2019 నుంచి 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. ఈ భారీ ఎటాక్ చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని NYT కథనం పేర్కొంది. చైనా ప్రభుత్వమే వీరికి నిధులు ఇస్తుందని ఆరోపించింది.