News August 31, 2025

జంగారెడ్డిగూడెం: కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

image

జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్‌ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు శుక్రవారం రాత్రి నుంచి కనిపించని విషయం తెలిసిందే. మధ్యాహ్నపువారి గూడెం కాలువలో ఆదివారం ఉదయం ఆయన బైక్ గుర్తించారు. ఈక్రమంలో గజ ఈతగాళ్లతో వాగు మొత్తం గాలించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 2, 2025

స్థానిక ఎన్నికలు.. ‘ఆమె’ కీలకం

image

గతనెల 28న ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల చేయగా 31 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 1042 క్లెయిమ్స్ వచ్చాయి. వీటిని పరిష్కరించి తుది జాబితాను నేడు విడుదల చేయనున్నారు. జిల్లాలో మొత్తం 8,02,690 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 4,14,124, పురుషులు 3,88,224, ఇతరులు 22 మంది ఉన్నారు. పురుషుల కంటే 26,180 మంది మహిళలు అధికంగా ఉన్నారు. అభ్యర్థుల విజయంలో వీరే కీలకం కానున్నారు.

News September 2, 2025

HYD: గ్రేటర్‌లో అత్యధిక వర్షపాతం

image

గ్రేటర్‌లో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్-1 నుంచి సెప్టెంబర్-1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 617.8 MM వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అత్యధికంగా అమీర్‌పేట, ఖైరతాబాద్‌లలో 56%, శేరిలింగంపల్లిలో 54% నమోదైంది.

News September 2, 2025

HYD: సకాలంలో విగ్రహాలను తరలించాలి: కమిషనర్

image

సకాలంలో గణేశ్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. గణేశుడి ప్రతిమల ఊరేగింపు మార్గాల్లో నిర్దేశించిన గార్బేజీ పాయింట్లలోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రజలు పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులకు సహకరించాలని కోరారు.