News August 31, 2025
WNP: బీసీలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి: మంత్రి

బీసీలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లుకు బీఆర్ఎస్, బీజెపి సహకరించాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కాలి. కాంగ్రెస్ కేంద్రంలో పవర్లో ఉన్నప్పుడే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభించింది. బీసీ మంత్రిపై బీఆర్ఎస్ బీసీ నేత తప్పుగా మాట్లాడడం సరికాదు’ అని అన్నారు.
Similar News
News September 2, 2025
HYD: నిమజ్జనానికి 259 మొబైల్ క్రేన్లు

HYDలోని అన్ని ప్రధాన చెరువుల వద్ద 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు. హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, DRF బృందాలు, 200 మంది గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. పోలీసుల సహకారంతో 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు నియమించామన్నారు.
News September 2, 2025
T20Iలకు గుడ్‌బై చెప్పిన స్టార్క్

ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. టీమ్ ఇండియాతో టెస్టు టూర్, యాషెస్ సిరీస్, 2027 వన్డే WC తనకు ముఖ్యమని పేర్కొన్నారు. కాగా 35 ఏళ్ల స్టార్క్ తన కెరీర్‌లో 65 టీ20లు ఆడి 79 వికెట్లు తీశారు. తన యార్కర్లతో స్టార్ బ్యాటర్లకు సైతం ముచ్చెమటలు పట్టిస్తారు.
News September 2, 2025
HYD: గణేశ్ నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

గణేశ్ నిమజ్జనానికి GHMC ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం కమిషనర్ కర్ణన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలను పరిశీలించారు. బారీకేడింగ్, లైటింగ్, క్రేన్లు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు చిన్న విగ్రహాల కోసం 72 కృత్రిమ కొలనులను ఏర్పాటు చేశామన్నారు.