News August 31, 2025
మైనర్లకు వాహనాలిస్తే రూ.లక్ష జరిమానా!

TG: 18 ఏళ్లు నిండకుండానే బైకులతో రోడ్లపై రయ్ రయ్ అంటూ మైనర్లు దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో తమ పిల్లలు ప్రాణాలు కోల్పోకూడదని జనగామ(D) నాగిరెడ్డిపల్లి గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే పెరెంట్స్‌కు రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రమాదాల నివారణకు బాధ్యతతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శనీయం.
Similar News
News September 3, 2025
పంటలలో తెగుళ్ల నివారణకు సూచనలు

వేసవిలో భూమి/నేలను లోతుగా దున్ని తెగుళ్లను కలిగించే శిలీంద్రాలను నాశనం చేయవచ్చు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి. తెగుళ్లను తట్టుకొనే రకాల విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనశుద్ధి తప్పక చేసుకుంటే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను నివారించుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తుకునే/నాటుకునే సమయాన్ని మార్చుకోవడం వల్ల తెగుళ్ల ఉద్ధృతి తగ్గుతుంది.
News September 3, 2025
డీజేల దగ్గర డాన్స్ చేస్తున్నారా? జాగ్రత్త

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 ఏళ్ల యువకుడు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఏ సంగీతమైనా నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే గుండెపై హానికర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
Share it
News September 3, 2025
గర్భాశయ ఆరోగ్యం కోసం..

మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయ ఆరోగ్యం చాలా ముఖ్యం. దీనికోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది వ్యర్థాలని బయటకు నెట్టి ఇన్‌ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉండే ఆహారాలు తీసుకుంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా చూస్తాయి. కణితులు ఏర్పడకుండా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే గుమ్మడి, అవిసె గింజలు, నువ్వులు తీసుకోవాలి.