News August 31, 2025
విశాఖలో వైసీపీ సర్వసభ్య సమావేశం

మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మహిళా సాధికారతో YCP బలోపేతం అవుతుందని అన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ కుంభారవి బాబు, ఇతర నేతలతో పాటు మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.
Similar News
News September 3, 2025
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మాడగడకు పవన్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 5వ తేదీన అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో ద్వారా అరకు వ్యాలీ మండలం మాడగడ గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో నిర్వహించనున్న బలిపోరోబ్ ముగింపు ఉత్సవంలో పాల్గొనున్నారు. 3:30కి మాడగడ నుంచి తిరిగి పయణమై సాయంత్రం 5:30కి తిరిగి విశాఖ చేరుకుంటారు.
News September 3, 2025
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అందని జీతాలు..!

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మూడో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా ప్రతినెల జీతంలో 75% మాత్రమే చెల్లిస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు మూడు రెట్ల జీతం యాజమాన్యం బకాయి పడిందన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News September 3, 2025
విశాఖలో హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్: సీపీ

విశాఖ కమిషనరేట్ పరిధిలో 4 హోంగార్డ్ పోస్టులకు సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే మంగళవారం మరో 3 పోస్టులు కలిపి మొత్తం 7 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల వయసు గల విశాఖకు చెందిన యువతీ, యువకులు అర్హులు. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు అప్లికేషన్ సీపీ కార్యాలయంలో అందజేయాలన్నారు.