News August 31, 2025
రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుంది: కలెక్టర్

మార్క్‌ఫెడ్ ద్వారా రూ.12కు ప్రభుత్వం ఉల్లిని కొనుగోలు చేస్తుందని, అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అధికారులతో ఉల్లి కొనుగోలు అంశంపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డులలో కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించారు.
Similar News
News September 3, 2025
ఉద్యోగం కోసమే తండ్రిని చంపాడా?

కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో తండ్రి రామాచారిని కుమారుడు వీరస్వామి చారి <<17598178>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. రామాచారి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం కోసం తండ్రిని కుమారుడు హతమార్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
News September 3, 2025
ఈనెల 4న కర్నూలులో ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ

ఈనెల 4న కర్నూలులో 730 వినాయక విగ్రహాల నిమజ్జనం ఊరేగింపును పురస్కరించుకొని ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బళ్లారి చౌరస్తా మీదుగా నంద్యాల చెక్ పోస్ట్ వైపు రాకపోకలు సాగిస్తాయన్నారు. బస్టాండ్ నుంచి రాజ్ విహార్, ప్రభుత్వ అసుపత్రి, వినాయక ఘాట్, గాయత్రి ఎస్టేట్ మీదుగా వాహనాలను నిషేధించినట్లు వెల్లడించారు. నగర ప్రజలు సహకరించాలన్నారు.
News September 3, 2025
ఈ నెల 6న కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ పోటీలు

ఈనెల 6న ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు కర్నూలులో జిల్లాస్థాయి మారథాన్ 5 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ వెల్లడించారు. కర్నూలులోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో క్రీడా అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 17 నుంచి 25 ఏళ్లు కలిగిన విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ భూపతి పాల్గొన్నారు.