News August 31, 2025

HYD: రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా బంద్

image

HYDలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి తెలిపింది. షేక్‌పేట్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 7 గంటల వరకు మంచినీటి సరఫరా బంద్ కానుంది.

Similar News

News September 4, 2025

నాంపల్లి: డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులకు 15 వరకు ఛాన్స్

image

డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్ కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 15 వరకు ఉందని ఇగ్నో సీనియర్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. నాంపల్లిలో ఇగ్నో స్టడీ సెంటర్ ఉందని, చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలను 040-23117550, 9492451812 నంబర్లకు ఫోన్ చేసి తెలసుకోవచ్చన్నారు.

News September 4, 2025

HYD: ఐకమత్యం.. ఫ్రెండ్స్‌కు లడ్డూ సొంతం

image

వినాయక నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డూ రూ.కోటి పలికింది అని వినగానే ఆశ్చర్యపోతాం. గొప్పింటి వారికి వేలంలో నెగ్గడం ఈజీ. కానీ మిడిల్ క్లాస్లో ఐకమత్యం ఉంటే చాలని ఈ మిత్రులు నిరూపించారు. రాంనగర్ EFYA ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో ఫ్రెండ్స్ లోకేష్, యోగేశ్వర్, కార్తీక్, డికాప్రియో కలిసి రూ.55 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఒక్కరితో కాదు.. నలుగురం కలిస్తే లడ్డూ దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

News September 4, 2025

HYD: ఈనెల 7న ఫ్రీడమ్‌ ఫర్‌ యానిమల్స్

image

మనం ఆరోగ్యంగా ఉండడానికి పాలు, గుడ్లు, మాంసం అవసరం లేదని గాంధీ దర్శన్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ డైరెక్టర్ ప్రొఫెసర్‌ గొల్లనపల్లి ప్రసాద్‌ తెలిపారు. శరీర పోషణ కోసం జంతువులు, వాటి ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందుకే జంతువులపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7న ఫ్రీడమ్‌ ఫర్‌ యానిమల్స్‌ పేరుతో శిల్పారామం నుంచి బొటానికల్‌ గార్డెన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.