News August 31, 2025
గణేశ్ నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. ఆదివారం ఐదో రోజు సందర్భంగా ఎక్కువ మొత్తంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చేటపుడు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News September 3, 2025
NLR: రూ.లక్షకుపైగా స్కాలర్‌షిప్.. ఇలా చేయండి

నెల్లూరు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం యశస్వి స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు ఈనెల 15వ తేదీ వరకు పొడిగించింది. వార్షికాదాయం రూ.2.50లక్షల లోపు ఉన్న బీసీ, ఓబీసీ, మైనార్టీ, డీఎన్టీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. 9, 10వ తరగతి వాళ్లకు రూ.75 వేలు, ఇంటర్ వాళ్లకు గరిష్ఠంగా రూ.1.25లక్షలు స్కాలర్‌షిప్‌గా ఇస్తారు. ఈ <
Share It.
News September 3, 2025
కావలిలో దారుణం

కావలిలో చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కుటుంబం 3ఏళ్ల కిందట కావలి మండలానికి వలస వచ్చింది. వీరికి కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉంది. తల్లి కూరగాయల కోసం వెళ్లినప్పుడు బ్రహ్మయ్య(20) బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News September 3, 2025
NLR: గన్‌తో బెదిరించిందని అరుణపై కేసు

ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదంలో తలదూర్చి తనను అరుణ గన్‌తో బెదిరించిందని నెల్లూరు నవాబుపేటకు చెందిన శశి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాను ఆసరాగా చేసుకుని అరుణ సెటిల్మెంట్‌కి ప్రయత్నం చేసింది. ఈక్రమంలో శశికుమార్ వినకపోవడంతో అతన్ని గన్‌తో బెదిరించింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.