News August 31, 2025
స్నేహపూర్వక వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్, పీస్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతమైన జిల్లాగా పేరు ఉందని, ఇకముందు కూడా ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగ పర్వదినాలను కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు.
Similar News
News September 3, 2025
భీమవరం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

రైతులను మోసం చేసేందుకు కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పౌరసరఫరాల, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అధిక ధరలకు అమ్మే దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
News September 3, 2025
భీమవరం: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో వర్క్ ఫ్రం హోం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాహనాల ఆధార్ సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, వర్క్ ఫ్రం హోం, ఈ-కేవైసీ వంటి అంశాలపై ఆమె చర్చించారు. ‘తల్లికి వందనం’ పథకంలో నగదు జమలో ఉన్న అడ్డంకులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
News September 3, 2025
డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ నాగరాణి

ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద డబ్బులు వసూలు చేసినట్లు రుజువైతే పెనాల్టీతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు ఆసుపత్రులపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత కమిటీతో కలిసి ఆమె విచారణ చేపట్టారు. భీమవరం ఒమేగా, రాజర్షి, శ్రీలక్ష్మి, మదర్‌వాణి, తణుకు ఆపిల్ ఆసుపత్రులతో సహా మొత్తం 16 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోపణలు వచ్చినట్లు ఆమె తెలిపారు.