News August 31, 2025
కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో చర్చ.. ఉత్కంఠ

TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News September 3, 2025
పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ గురించి తెలుసా?

చాలామంది స్త్రీలలో గర్భాశయం, ఫెలోఫియన్ ట్యూబ్‌లు, అండాశయాల్లో పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ వస్తుంది. క్లామీడియా, గోనోరియా బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రోగనిరోధక శక్తి లేకపోవడం, ప్రసవం, గర్భస్రావం తర్వాత కొన్నిసార్లు ఈ సమస్య వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే వంధ్యత్వ ప్రమాదం ఉంది. పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి.
News September 3, 2025
సానుభూతి కోరుకుంటున్నారా?

చాలామంది అమ్మాయిలు వారి భావోద్వేగాలను సోషల్ మీడియాలో పంచుకొని, జనాల మద్దతు కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల నష్టాలే ఎక్కువంటున్నారు మానసిక నిపుణులు. ఇలా చేస్తే మీ సమస్యలను కొందరు అవకాశంగా తీసుకోవచ్చు. దీనివల్ల కొత్త ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి సన్నిహితులు, మానసిక ఆరోగ్యనిపుణుల సాయం తీసుకోవడం మంచిది. SMలో ఏవైనా పోస్టు చేసేటప్పుడు జాగ్రత్త, గోప్యత వహించాలి.
News September 3, 2025
మహిళల ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అందుకే ప్రతి మహిళ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. *వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో కండరాలు బలహీనంగా మారతాయి. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామం చేయాలి. *వెజ్, నాన్ వెజ్ రూపంలో ప్రోటీన్ తీసుకోవాలి. *కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. *బోన్ హెల్త్ కోసం 35+ వయసున్నవారు వారానికి 2సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి.