News August 31, 2025

భారతీయులు చేతితోనే ఎందుకు తింటారంటే?

image

ఇప్పటికీ మెజారిటీ భారతీయులు చేతితోనే ఆహారం తింటారు. ఆహారానికి, చేతికి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఆహారం ఉష్ణోగ్రత, స్వభావం తినడానికి ముందే తెలుసుకోవచ్చు. చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. చేత్తో తినడం వల్ల ఈ శక్తులు ఆహారంతో కలిసి సులభంగా జీర్ణమవుతుంది. చేతి వేళ్లలోని నరాల కొసలు కూడా జీర్ణక్రియలో కీలకం. అలాగే చేతితో తింటే ఎంతకావాలో అంతే తింటాం. ఇది స్పూన్, ఫోర్క్ ద్వారా సాధ్యం కాదు.

Similar News

News September 3, 2025

వంగ, బెండలో తొలి దశలో చీడపీడల నివారణ

image

వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్‌ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.

News September 3, 2025

కాపు దశలో వంగ, బెండలో చీడల నివారణ ఇలా!

image

కాపు దశలో కాయలను కోసే ముందు అక్షింతల పురుగు, పెంకు పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోయాలి. తోటలో మొక్కలు బాగా తడిసేటట్లు కాయలు కోసిన తర్వాత లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్ బెంజోయేట్, 0.4ml కోరాజిన్, 2ml ప్రొఫినోపాస్ మందుల్లో ఒక దానిని 5ml వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. కాయలను కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.

News September 3, 2025

పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ గురించి తెలుసా?

image

చాలామంది స్త్రీలలో గర్భాశయం, ఫెలోఫియన్ ట్యూబ్‌లు, అండాశయాల్లో పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ వస్తుంది. క్లామీడియా, గోనోరియా బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. రోగనిరోధక శక్తి లేకపోవడం, ప్రసవం, గర్భస్రావం తర్వాత కొన్నిసార్లు ఈ సమస్య వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే వంధ్యత్వ ప్రమాదం ఉంది. పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి.