News August 31, 2025

బుడమేరు ప్రణాళిక ఇదే.. అమలయ్యేది ఎప్పుడో?

image

బుడమేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు నాలుగు డీపీఆర్‌లను సిద్ధం చేశారు. పూడికతీతతో పాటు, వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 25 కి.మీల ప్రత్యామ్నాయ కాలువ, 36 కి.మీల అండర్ టన్నెల్ నిర్మాణం, కొల్లేరు-ఉప్పుటేరు కాలువ వెడల్పు వంటివి ఈ ప్రణాళికల్లో ఉన్నాయి. రూ. 4,864 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా, ఇప్పటివరకు ఏ ఒక్కటీ అమలు కాలేదు.

Similar News

News September 4, 2025

NLG: ఉత్తమ ఉపాధ్యాయులుగా 208 మంది ఎంపిక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 208 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రతి సంవత్సరం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుక్రవారం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నారు.

News September 4, 2025

ఆ కోర్సుల్లో దృష్టి లోపం గల దివ్యాంగులకు అనుమతి: విద్యాశాఖ

image

AP: మంత్రి లోకేశ్ చొరవతో దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు MPC, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ GO జారీ చేసింది. సైన్స్ కోర్సుల్లో తమకు అవకాశం కల్పించాలన్న దివ్యాంగుల విజ్ఞప్తికి స్పందించిన లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు ఆ విద్యార్థులు హాజరవ్వడం కష్టమని అధికారులు తెలపగా, బదులుగా లఘురూప ప్రశ్నలతో ఎసెస్‌మెంట్ చేయాలని మంత్రి సూచించారు.

News September 4, 2025

కామారెడ్డి: వరద నష్టంపై సీఎంకు కలెక్టర్ ప్రజెంటేషన్

image

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్‌ ఆశీష్‌ సాంగ్వాన్‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. IDOCలో కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పంటలు, రోడ్లు, ఇళ్లు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టాలను వివరించారు. వర్షాల వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన అంచనాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా అందజేశారు.