News August 31, 2025

కాళేశ్వరంతో ఐదేళ్లలో వాడుకుంది 101 టీఎంసీలే: ఉత్తమ్

image

TG: రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఐదేళ్లలో 101 టీఎంసీలు మాత్రమే వాడుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ‘సంవత్సరానికి 195 TMCలు లిఫ్ట్ చేస్తామని చెప్పారు. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి 2023 OCT వరకు ఐదేళ్లలో 162 TMCలే ఎత్తిపోశారు. ఇందులో 32 TMCలు సముద్రంలోకి వదిలిపెట్టారు. ఆవిరి పోనూ ఐదేళ్లలో 101 TMCలే వాడుకున్నారు. అంటే ఏడాదికి 20.2 TMCలే’ అని విమర్శించారు.

Similar News

News September 3, 2025

INSPIRING: 37 ఏళ్లపాటు నిస్వార్థ సేవ❤️

image

దేశ సేవ కోసం జీవితాన్నే త్యాగం చేసిన ఎంతో మంది మహానుభావులు మనకు స్ఫూర్తినిస్తుంటారు. వారిలో బ్రిగేడియర్ గిడుగు హిమశ్రీ ఒకరు. 1988లో ఇండియన్ ఆర్మీలో చేరిన ఆమె 37ఏళ్లపాటు వివిధ ర్యాంకుల్లో సేవలందించారు. అరుణాచల్ అడవుల నుంచి సియాచిన్ మంచు శిఖరాల వరకు అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ మెడికల్ యూనిట్లకు నాయకత్వం వహించారు. సోమాలియా వంటి సంఘర్షణ ప్రాంతాలలోనూ ఆమె అచంచలమైన ధైర్యాన్ని, దేశభక్తిని ప్రదర్శించారు.

News September 3, 2025

నా లేఖ లీక్ చేసింది సంతోష్ రావే: కవిత

image

TG: కేసీఆర్‌కు తాను రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావేనని కవిత ఆరోపించారు. ‘నా దగ్గర ఉన్న విషయాలన్నీ బయటపెడితే BRS నేతలంతా ఇబ్బందిపడతారు. హరీశ్, సంతోష్ అక్రమాల గురించి గతంలోనే KCRకు చెప్పా. ఇప్పటివరకు రెండు గ్యాంగులతో అంతర్గతంగా పోరాడా. ఇప్పుడు బయట నుంచి ఫైట్ చేస్తా. చెప్పాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా’ అని మీడియాతో పేర్కొన్నారు.

News September 3, 2025

కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు: మంత్రి తుమ్మల

image

కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల కొరత వచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌కి ఆస్కారం లేదు. రామగుండంలో 4 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది’ అని వివరించారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.